Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫర్నిచర్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమం

Fire Accident In Hyderabad Furniture Godown
Advertisement
  • హైదరాబాద్‌లోని జియాగూడ పరిధిలో ఘటన
  • చిక్కుకున్న 20 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
  • తీవ్రంగా గాయపడిన ఆరుగురికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స
  • ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం!
Advertisement
హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కుల్సుంపుర జియగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో జరిగిందీ ఘటన. భవనం మూడో అంతస్తులో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపిక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

గోదాములో చిక్కుకున్న 20 మందిని రక్షించారు. వారిలో  తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement
Fire Accident
Hyderabad
Furniture Godown

More Telugu News